ఈ నెల 9న తలపెట్టిన రైతు పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కంబదూరు మండల కేంద్రంలో సోమవారం వైసీపీ శ్రేణులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంబదూరు మండల కన్వీనర్ గొల్ల హనుమంతరాయుడు, పట్టణ కన్వీనర్ వెంకటప్ప మాట్లాడారు. యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వైనాన్ని వివరించారు. రైతులందరికీ ప్రభుత్వం యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రైతు పోరు కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు.