విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలోని దుప్పలపూడి గ్రామానికి చెందిన సీర రాఘవ అనే 29 ఏళ్ల యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్ఐ ప్రసాదరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా చినగుడబ సచివాలయ పరిధిలో రాఘవ అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. విలాస వంతమైన జీవితానికి అలవాటు పడి అప్పులు పాలయ్యాడు. జీవితంపై విరక్తి కలిగి శనివారం తన ఇంట్లో పరుగులు మందు తాగాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.