జ్ఞానపురం ప్రాంతంలో వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి తమపై దుష్ప్రచారం చేస్తున్న వారిని 41 వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ హెచ్చరించారు. బుధవారం వార్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడార వైయస్సార్ వర్ధంతి సందర్భంగా చీరలు పంపిణీ కార్యక్రమంలోని వినాయక ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమాన్ని సైతం తప్పుపడుతూ వాట్సాప్ గ్రూపులో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వార్డు అభివృద్ధి కోసం మాట్లాడాలంటే నేరుగా వచ్చి మాట్లాడాలని ఇలా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రచారం చేయడం సరి కాదన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.