ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలని, కార్మికుల సమస్యల పరిష్కరించాలని కార్మికుల, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పార్వతీపురం కలక్టరేట్ గేటు ఎదుట నిరసన తెలిపారు. అనంతరం డిఆర్ఓ హేమలతకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.గౌరీశ్వరరావు, ఆర్.రాము, సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఇసుక క్వారీలు ఆసివేశారన్నారు.