ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పెద్ద నాగులవరం రోడ్డులో గల ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ను సబ్ కలెక్టర్ ఎస్వి త్రివినాగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల వసతి గృహంలో వసతులను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పిల్లలతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజనాన్ని కలిసి భుజించారు. భోజనం నాణ్యత రుచి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అన్ని వసతులు భోజన సదుపాయం బాగుందని సబ్ కలెక్టర్ తెలిపారు.