బషీర్‌బాగ్ విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన విద్యుత్ అమరవీరులకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. 2000 సం.లో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా బషీర్‌బాగ్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో అసువులు బాసిన అమరవీరులకు వారి 25వ, వర్థంతి సందర్భంగా సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ అధ్యక్షతన రామకృష్ణ స్థూపం వద్ద జరిగిన కార్యక్రమంలో వామపక్ష నాయకులు మాట్లాడారు