ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం వేస్ట్ పిక్చర్ల కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. చిత్తు కాగితాలు, సీసాలు, పాత ఇనుము వంటి వస్తువులను ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న వారిని గుర్తించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నమస్తే పథకం ద్వారా వారికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం యొక్క ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొంతమందిని గుర్తించి వారిని జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేస్ట్ పిక్కర్లకు మంచి జీవన విధానం అందించేందుకు ఈ పథకాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు.