గోకవరంలో 16 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు. శుక్రవారం ఆయన ఆ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి, బాలికకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గోకవరం మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.