శనివారం సాయంత్రం గద్వాల గర్జనలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ MLA బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే రైలు కింద తల పెడతా కానీ కాంగ్రెస్లో మాత్రం చేరను" అని చెప్పిన బండ్ల కృష్ణమోహన్ ఎందుకు మాట తప్పారని కేటీఆర్ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. “నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్లావా లేక నీ సొంత అభివృద్ధి కోసం వెళ్లావా?" అంటూ కౌంటర్ వేశారు