గణేశ్ మండపాలకు పోలీసుల అనుమతులు ఎందుకు తీసుకోవాలని హైందవ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. వందల సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకుంటున్న గణేశ్ మండపాలకు కేవలం పోలీసులకు సమాచారం అందివ్వాలి తప్పా అనుమతులు ఎందుకు తీసుకోవాలన్నారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రులు జరుపుకోవాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని వెంకటేశ్వరరావు కాకినాడ జిల్లా పిఠాపురంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మీడియాతో మాట్లాడారు.