కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం కుంతీ మాధవస్వామి ఆలయం వీధిలో కృష్ణవేణి అనే మహిళ ఇంట్లో సంవత్సరం క్రితం ఆమె ఇంట్లో లేని సమయంలో పట్టపగలు చోరి జరిగింది. ఈ చోరీలో ఇంట్లో ఉన్న 80 గ్రాములు బంగారాన్ని దొంగలు దోచుకున్నారు. కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీన పరుచుకున్నారు. సందర్భంగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ శుక్రవారం 11 గంటలకు అందజేశారు. పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.