ఐజ మండల పరిధిలోని ఉప్పల గ్రామంలో గత 20 రోజులుగా గ్రామస్తులు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదివారం ఉదయం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ ఉప్పల గ్రామస్తుల త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని తక్షణమే స్థానిక ఎన్నికలు నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.