తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీమంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తిస్తూ గత ప్రభుత్వం హార్టికల్చర్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం జరిగిందని గుర్తు చేశారు.