భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడినట్లు తెలిపారు.ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి ఇన్చార్జి శ్యాంబాబు,జిల్లా నాయకుడు అంబాల చంద్రమౌళి ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి రోజున కలెక్టర్ కార్యాలయం ముందు పెన్షన్ల కోసం ధర్నా చేస్తున్న నేపథ్యంలో, ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలపై దుర్భాషలాడుతూ అకారణంగా లాటి చార్జి చేసి గాయపరిచిన పట్టణ సీఐ నరేష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.