గ్రామీణ ప్రాంతాలలో విషద్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ సురేష్ నాయుడు కోరారు. మణుగూరు మండలం అక్కంపేటలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకి అయిన పర్యటించారు. సైడ్ కాలువలలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటం వల్ల రోగాల బారిన పడతారని.. చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.