దివ్యాంగుల సమస్యల పై పోరాడుతున్న తమ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం సరికాదని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏలూరు జిల్లా అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం అన్నారు. శుక్రవారం సాయంత్రం 5గంటలకు భీమడోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగభూషణం మాట్లాడారు.. ఇటీవల దివ్యాంగుల సమస్యల పై వినతులు ఇవ్వడానికి ఏలూరు కలెక్టరేట్ కి వచ్చిన సమయంలో తీసిన వీడియోలు పలువురు రాజకీయ లబ్దికి వాడుకుంటున్నారని ఆవేదన చెందారు. సమావేశం నక్కా రాము, ఉండ్రు బెంజిమెన్,జోసెఫ్, బాజీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.