నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో జాతీయ లోక్ అదాలత్ శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హైకోర్టు జడ్జి తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, జస్టిస్ సామ్ కోషి, జస్టిస్ సుజనా కళాసికం హాజరయ్యారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో ప్రతి మూడు నెలలకోసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో జిల్లా జడ్జి శ్రీవాణి, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.