శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని ధర్మవరం పట్టణంలో ప్రమాదవశాత్తు చున్ని అంటుకుని వివాహితకు తీవ్ర గాయాలైన సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.