కాకినాడజిల్లా తుని పట్టణ అమ్మాజీ పేట ప్రాంతంలో ప్రజా దర్బార్ కార్యక్రమం శనివారం జరిగింది..ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వీప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొని ప్రజల సమస్యలు వింటూ పరిష్కార దిశగా ముందుకు వెళ్లారు. ముఖ్యంగా ఎలాంటి సమస్య అయినా పరిష్కరించడమే ప్రజా దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశం అని ఎమ్మెల్యే తెలియజేశారు. అన్నిశాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు