హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ నీలి వాసవి కి ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కలువ కుంట రామకృష్ణతోపాటుగా అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది శ్రీమతి డా.వాసవిని జగిత్యాల కళాశాల ఆవరణలో శనివారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. డాక్టర్ వాసవి గత 15 ఏళ్లుగా రసాయనశాస్త్రం సహాయ ఆచార్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.