ఆరోగ్యశ్రీ ద్వారా రాజశేఖర్ రెడ్డి ఎంతోమందికి ఊపిరి పోసారని మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. అలాంటి గొప్ప నాయకుడ్ని కోల్పోవడం బాధాకరం అన్నారు. నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ.. రాజకీయ చరిత్రలో చెక్కుచెదరని అభిమానం కలిగిన నేత రాజశేఖర్ రెడ్డి అంటూ మంగళవారం ఉదయం 11 గంటలకు అన్నారు.