ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ రైతులను దగా చేస్తున్న టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రా రెడ్డి నిప్పులు చెరిగారు. ఈనెల 9న ఎరువుల బ్లాక్ మార్కెట్పై 'అన్నదాత పోరు' నినాదంతో నంద్యాల ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉచిత పంటల బీమాను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.