నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక నిమజ్జోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం పట్టణంలోని పురవీధుల గుండా వినాయక నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.