అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల సమయం లో యూరియా సరఫరా మరియు డిమాండ్ పై జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, జిల్లా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు.అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ పి.జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ పాల్గొన్నారు.