జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని పోలిస్ స్టేషన్ లో గణేష్ మండపాల నిర్వాహకులతో బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి ధర్మపురి సీఐ రామ్ నర్సింహారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, వినాయక నిమజ్జన కార్యక్రమంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జనం సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని మండప నిర్వాహకులను ఆదేశించారు. అలాగే పోలీసులు, మండప నిర్వాహకులు పరస్పర సహకారంతో ఉత్సవాలను విజయవంతంగా ముగించుకోవాలని ఆయన కోరారు. శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జన వేడుకలను జరుపుకోవాలని కోరారు.