ఆస్పరి మండలంలో వర్షాల కారణంగా కూలిపోయిన బ్రిడ్జ్ మరమ్మత్తులు పనులు చేయాలని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రమేష్ బుధవారం తెలిపారు.అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో యాటకల్లు గ్రామం నుండి ఐనేకల్లు మరియు ఆస్పరి కి వెళ్లే దారిలో భారీ వర్షాల వల్ల బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టి కొత్త బీటీ రోడ్డుని వేయాలని, కూలిన బ్రిడ్జి దగ్గర నిరసన తెలియజేయడం జరిగిందన్నారు.