విశాఖలో పవన్ అభిమానులు సందడి చేశారు. విశాఖ వీదుల్లో ఓజీ చిత్రం పోస్టర్లతో బుధవారం ర్యాలీ నిర్వహించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది అభిమానుల్లో ఉండే హడావుడి చాలా స్పెషల్ గా ఉంటుంది. ప్రజలకు సేవ చేసే నాయకుడిగా బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా చేస్తున్న ఓజీ సినిమా మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తమన్ మ్యూజిక్ మ్యాజిక్‌లో ఫైర్ స్టార్మ్ తర్వాత సువ్వి సువ్వి మెలోడీ విడుదల కావడం, సినిమాకు మాస్ క్లాస్ కలయికని చూపిస్తోంది. ఈ పాట లిరికల్ వీడియోను పురస్కరించుకుని, బుధవారం ర్యాలీ చేశారు.