అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత పోరు కార్యక్రమానికి భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. యూరియా బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని, రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు నినాదాలతో ప్రాంగణాన్ని మార్మోగించారు.పార్లమెంటరీ పరిశీలకులు సురేష్ బాబు మాట్లాడుతూ...రైతు కష్టానికి తగిన గుర్తింపు రావాలి. రైతులకు యూరియా అందకపోవడం చాలా ఆందోళన కలిగించే విషయం. బ్లాక్ మార్కెట్‌లో ఎరువులు అమ్మకాన్ని ప్రభుత్వం కఠినంగా అరికట్టాలి. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మేము నిరంతరం