కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా శుక్రవారం గణనాథుల నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం, కుందుర్పి, బ్రహ్మసముద్రం, సెట్టూరు, కంబదూరు మండలాలలో ఘనంగా నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. మహిళలు సైతం డాన్సులు వేస్తూ, కేరింతల కొడుతూ నిమజ్జన కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఎక్కడ చూసినా సందడి, కొలాహలం నెలకొంది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.