కళ్యాణదుర్గం నియోజకవర్గం వివిధ రూపాల్లో గణనాథులు కొలువుదీరారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, కంబదూరు, సెట్టూరు, కుందుర్పి మండలాల పరిధిలో మండపాలలో గణనాథులు కొలువుదీరారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినాయక మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక మండపాల వద్ద ఎక్కడ చూసినా సందడి నెలకొంది. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.