కేవీబీ పురం: మట్టి నమూనాల సేకరణ పై విద్యార్థులకు అవగాహన వ్యవసాయ పొలాల్లో మట్టి నమూనాల పరీక్షలు, ప్రాముఖ్యతలపై విద్యార్థులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. పీఎంఆర్ కేవీవై పథకం ద్వారా సాయిల్ హెల్త్ క్లినిక్ ఆధ్వర్యంలో, విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారి పరమేశ్వరి నేతృత్వంలో ఈ అవగాహన తరగతులను నిర్వహించి,విద్యార్థులకు మట్టి నమూనాలు తీసే పద్ధతి, సిద్ధాంత పరంగా, ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు.