తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు లో అక్రమంగా యూరియా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం గంపలగూడెం మండలం ఉట్టుకూరు ప్రాంతంలో వాహనాలు తనిఖీలు చేపట్టారు. క్రమంలో 40 యూరియా 40 పొటాషియం బస్తాలను అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో పోలీసులు సీజ్ చేశారు వాటితో పాటు ఓ వాహనాన్ని కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. వాహనం నడుపుతున్న డ్రైవరుపై మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు