రామాయంపేట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పర్యటించారు పట్టణంలోని పలు వినాయక మండపాల వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు, వినాయక మండపాల దగ్గర నిర్వాహకులు ఆయనను శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు వరదలు ఓవైపు పండగ చాలా ఇబ్బందికర పరిస్థితిలో పండుగ జరుపుకోవడం జరిగిందని సంతోషంగా జరుపుకోవాల్సిన వినాయక చవితి పండుగను బాధాకరంగా జరుపుకోవడం జరిగిందని ఆయన అన్నారు, నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.