కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల అదాని ఒప్పందాలను రద్దుచేసి ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో వేస్తున్న భారాలను తగ్గించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాగన్న, సుధాకర్ డిమాండ్ చేశారు. గురువారం ఓర్వకల్లు సచివాలయం ఎదుట వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 2000లో విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామికి నివాళులు అర్పించారు. కుటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలన్నారు.