మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా సాకేత్ టవర్స్ సమీపంలో 30 35 ఏళ్ల గర్భవతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.