బొబ్బిలి మండలం ఎం బూర్జి వలస గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం చెరువులో పడి మృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామానికి చెందిన గేదెల అప్పలనాయుడు తో పాటు యువకుల సహకారంతో పోలీసులు చెరువులో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే చెరువులో పడి మృతి చెందిన గుర్తు తెలియనివ్యక్తి మృతదేహం ఇంకా లభ్యం కాలేదు.