జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన ఓ ఇంటి ప్రహారి గోడపై రాజకీయంగా నిన్ను సమాధి చేస్తా అని రాసి అదే ఇంటి ముందు క్షుద్ర పూజలు చేయటం కలకలం సృష్టించింది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.