కంది మండలం చిమ్నాపూర్ గ్రామపంచాయతీని జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ రికార్డులను పరిశీలించి, గ్రామ పరిధిలోని ఆస్తులు, నర్సరీ, శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్, అవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషనను పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరచాలని ఆయన సూచించారు