కేంద్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన యూరియాను రాష్ట్రాలకు సరఫరా చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అన్నదాతలకు సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. పత్తి పంటకు కనీస మద్దతు ధర రూ. 10,075 ప్రకటించాలని, రాష్ట్రంలో కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.