వినాయక చవితి మండపాల నిర్మాణం , నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చిత్తూరు నగర పలక సంస్థ కమిషనర్ పి నరసింహ ప్రసాద్ తెలిపారు. మంగళవారం చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో గణేష్ ఉత్సవ నిమర్జనం కమిటీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చిత్తూరు నగర పరిధిలో మండపాలు ఏర్పాటు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఇంజనీరింగ్, పారిశుద్ధ కార్మికులతో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. కట్ట మంచి వివేకానంద సాగర్ వద్ద నిమర్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విద్యుత్ పారిశుధ్యం, టాయిలెట్ సౌకర్యాలు కల్పించామన్నారు. పర్యావరణ పరిరక