వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి పొందాలని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ జి. బాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఎం పాలెం పీఎస్ పరిధిలో గణేష్ ఉత్సవ కమిటీలు, డీజే నిర్వాహకులు పోలీసులు ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పందిర్లకు 11 రోజులకు మించి అనుమతులు ఇవ్వబడవని, పర్యావరణానికి హాని కలిగించే ఎటువంటి కార్యక్రమాలు సహించబోమని స్పష్టం చేశారు. చవితి మండపాలలో డీజేలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రాత బాగ్చి, ఐపీఎస్ ఆదేశాల మేరకు అనుమతులు లేవని తెలిపారు.