ప్రకాశంజిల్లా ముండ్లమూరు మండలంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా పర్యటించారు. మండలంలోని సింగన్నపాలెం గ్రామంలో వరిపంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూరియా కొరత లేకుండా చూస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. అనంతరం ముండ్లమూరులోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలో రోగులతో మాట్లాడి సరైన వైద్యం అందిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. అనంతరం వైద్యశాలలో రికార్డులు పరిశీలించి వైద్యులకు తగు సూచనలు అందించారు.