స్త్రీ శక్తి పథకంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ ద్వారకా తిరుమలరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం 4:00 సమయంలో బాపట్ల కొచ్చిన ఆయన ఆర్టీసీ బస్టాండ్ ను డిపోను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. త్వరలోనే స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. పథకంలో ఎదురవుతున్న ఆటుపోట్లను పరిష్కరించి మెరుగైన సేవలందిస్తామన్నారు.