తిరుపతి జిల్లా.. గూడూరు నియోజకవర్గం.. కోట మండలంలోని ఉచ్చూరువారి పాళెం గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వరికోత మిషన్‌కు కరెంట్ షాక్ తగలడంతో.. అందులో ఉన్న 23 ఏళ్ల రవి అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు కర్ణాటక రాష్ట్రం.. రాయచూర్ జిల్లా.. చందనూర్ మండలం.. గుడుగుల దిన్నె గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఈవిషయం ఆలస్యంగా తెలుసుకున్న మృతుడు సోదరుడు నాగరాజు అనే వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు.