నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలోని బిజెపి ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ప్రధాన సమస్యలను పరిష్కరించాలని నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తుంగతుర్తి నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ కడియం రామచంద్రయ్య మాట్లాడుతూ ఊటుకూరు గ్రామం నుంచి బండమీదిగూడెం, తుడిమిడి నుంచి అంబారి పేట వంగమర్తి నుంచి చిత్తలూరు ప్రధాన రహదారులను నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన బిజెపి పోరాటం చేస్తుందని తెలిపారు.