గాంధీభవన్లో అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆదివారం మధ్యాహ్నం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గాల సాధికారత దిశగా ఇది చారిత్రాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు. బీసీ బిల్లు ఆమోదం కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.