కర్నూలు నగరంలోని ఏపీ స్టేట్ వేర్ హౌస్, ఎఫ్‌సిఐ, ప్రైవేట్ గోడౌన్స్ హమాలీ యూనియన్ మహాసభ ఆదివారం కేకే భవన్‌లో ఘనంగా జరిగింది. ఈ మహాసభకు విష్ణుమూర్తి అధ్యక్షత వహించారు.మహాసభకు హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, నగర అధ్యక్షులు ఆర్.నరసింహులు, నగర కార్యదర్శి సిహెచ్.సాయిబాబా, నాయకులు టి.రాముడు తదితరులు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ – “హమాలీ కార్మికులు పని భద్రత లేకుండా కుటుంబాలను పోషించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు రోజూ బరువులు మోసి, 50 ఏళ్లు నిండక ముందే ఆరోగ్య సమస్యలకు గురై కుటుంబాలకు భారమవుతున్నారు. కాబట్టి హమాల