భూపాలపల్లి విద్యార్థులు,భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తా నందు ప్రజలకు సౌర వ్యవస్థ మరియు గ్రహణాలు ఎలా ఏర్పడతాయి అనే అంశం గురించి అవగాహన కల్పించారు. గ్రహణం సమయంలో వాస్తవికత ఏమిటి, మరియు పురాతన మూఢనమ్మకాలు ఏమిటి అనే దాని గురించి మరియు ఆహార భద్రత, గ్రహణాన్ని చూసే ముందు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారు వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎం.ఎస్.మూర్తి మరియు శివనారాయణ గార్లు అలాగే ప్రిన్సిపాల్ భవిత మరియు ఉపాధ్యాయులు భవానీ, భావన, జ్యోతి, యశశ్విని గార్లు పాల్గొన్నారు.