రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పెన్షన్ అంటేనే టెన్షన్ గా మారిన పరిస్థితి నెలకొందని అనంతపురం నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నగరంలోని ఆయన తన కార్యాలయం నుంచి ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని నిర్వహించి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లను ఇష్టానుసారంగా కోత విధించిన కూటమి ప్రభుత్వం నేపథ్యంలో లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు.