రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామ శివారులో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బోధన్ కు వెళ్లే ఆర్టీసీ బస్సుకు మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తృటీలో ప్రమాదం తప్పింది. అంబం గ్రామం నుండి బోధన్ కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు రావడంతో దారి ఇద్దామనే ప్రయత్నంలో డ్రైవర్ బస్సును కాస్త పక్కకు తీశాడు. దీంతో ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. గమనించిన బస్సు డ్రైవర్ బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకు దించాడు. దీంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది.